News December 1, 2024

HYD: టార్గెట్ అవే.. దొంగలు పడుతున్నారు జాగ్రత్త.!

image

HYDలో చొరబడ్డ మధ్యప్రదేశ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా మహిళలు, శుభకార్యాలు, ఫంక్షన్ హాళ్లు, జనసంద్రం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతోంది. అందరిలాగే లగేజీతో హాజరై అన్నీ కొట్టేస్తున్నారు. అందర్నీ ఆశీర్వదించి, భోజనాలు చేసే సమయంలో మెళ్లగా మహిళలను టార్గెట్ చేసి ఆభరణాలను సైతం ఎత్తుకెళ్తున్నారు. చివరికి పర్సనల్ పాకెట్లు సైతం ఖాళీ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త..!

Similar News

News March 14, 2025

HYD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

షాద్‌నగర్‌లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

News March 13, 2025

HCUకు ఉత్తమ యూనివర్సిటీగా గుర్తింపు

image

ప్రముఖ యూనివర్సిటీ HCUకు అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన క్యూఎస్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలపై స్టడీ నిర్వహించి ర్యాంకింగ్స్ విడుదల చేసింది. 1700 విశ్వవిద్యాలయాల్లో సర్వే చేయగా ఏడు సబ్జెక్టుల్లో ర్యాంక్ పొందింది. లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, సోషియోలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్‌లో ఉత్తమ ర్యాంకులను సాధించింది.

News March 13, 2025

HYD: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

error: Content is protected !!