News February 20, 2025

HYD: టీజీడీపీఎస్ సలహా కమిటీ సభ్యుడిగా ప్రొ.కంచె ఐలయ్య

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ అభివృద్ధి, ప్రజా పాలన, తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చే కమిటీలో ప్రొ.కంచె ఐలయ్యకు చోటు కల్పించారు. కమిటీలో యూజీసీ మాజీ ఛైర్మన్ సుఖ్ దేవ్ తొరట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ. భూక్యా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్లానింగ్, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన పనిచేయనుంది.

Similar News

News December 4, 2025

సికింద్రాబాద్‌ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

image

సికింద్రాబాద్‌ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్‌ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?

HYDలో యముడిని తీసుకొచ్చారు!

image

HYDను ‘సేఫరాబాద్’గా మార్చేందుకు ఓ ఫౌండేషన్ వినూత్న రోడ్ సేఫ్టీ క్యాంపైన్ ప్రారంభించింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు యమధర్మరాజును రంగంలోకి దించింది.
రసూల్‌పురా జంక్షన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని 365 కూడళ్లలో ఏడాది పాటు కొనసాగించనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే పెద్దఎత్తున మరణాలు తగ్గుతాయన్నారు.