News May 23, 2024

HYD: టీ-వర్క్స్, టీ-హబ్‌కు సీఈవోల నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ-హబ్ సీఈవోగా సీతా పల్లచోళ్లను నియమించింది. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా టీ- వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం.

Similar News

News September 19, 2025

HYD- నల్లగొండ.. 74 కొట్టుకుపోయిన డెడ్‌బాడీ

image

అఫ్జల్‌సాగర్‌ నాలాలో గల్లంతైన మాన్గార్‌ బస్తీ యువకుడు అర్జున్‌ (26) మృతదేహం నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద మూసీలో కనిపించింది. ఈ నెల 14న అర్జున్‌, రామా గల్లంతయ్యారు. 5 రోజుల తర్వాత నల్లగొండ మూసీ నదిలో డెడ్‌బాడీ ఉన్నట్లు సిబ్బంది కనుగొన్నారు. అతడి డెడ్‌బాడీ 74 కిలో మీటర్ల దూరం కొట్టుకుపోయింది. అర్జున్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

News September 19, 2025

HYD: అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్లు కాల్ చేయండి

image

రెండు రోజులుగా నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదనీరు రోడ్లపైకి చేరి ప్రజలను, వాహనచోదకులను ఇబ్బంది పెడుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. GHMC 040- 2111 1111, HYD కలెక్టరేట్‌ 90634 23979 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు కోరారు.

News September 19, 2025

HYD: మన బతుకమ్మ ఇంటర్నేషనల్ రేంజ్‌కు లోడింగ్

image

ఈ ఏడాది బతుకమ్మ వేడుక చరిత్రలోనే కీలక ఘట్టంగా SEP 28న ఎల్బీస్టేడియంలో ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపై 20,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు పర్యాటకశాఖ నడుం బిగించింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచపటం మీద నిలిపేందుకు, విదేశీ ఎయిర్‌లైన్ల నుంచి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణ. ఇదే జరిగితే బతుకమ్మ ప్రపంచస్థాయి పండుగగా గుర్తింపు పొందడం ఖాయం.