News December 8, 2024
HYD: ట్యాంక్ బండ్పై ఎయిర్ షోకు వెళ్తున్నారా?
HYD హుస్సేన్ సాగర్ వద్ద జరిగే ఎయిర్ షోకి వెళ్లే వారికి పోలీసులు సూచనలు చేశారు. PVNR మార్గ్, నెక్లెస్ రోడ్డులో కార్లు, టూ వీలర్ పార్కింగ్, ఆదర్శనగర్ గల్లీలో టూవీలర్, GHMC హెడ్ ఆఫీస్ గల్లీలో కార్లు, టూవీలర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోట్ క్లబ్లో మంత్రుల కార్లు, అమరవీరుల స్మారక చిహ్నం వద్ద MLA, MP, MLC, IAS, నేతల వాహనాల పార్కింగ్ ఉంటుందని చెప్పారు.
Similar News
News February 5, 2025
మోకిల: స్కూల్ బస్సును ఢీకొని IBS విద్యార్థి మృతి
స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు వివరాలు ప్రకారం.. శంకర్పల్లి మండల IBS కాలేజీలో Btech చదివే విద్యార్థులు బొడ్డు శ్రీహర్ష (19), హర్ష నందన్ వేదాంతం (19) ఇద్దరు బైక్పై కొండకల్ నుంచి మోకిలకు వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని శ్రీహర్ష అక్కడికక్కడే చనిపోయాడు. హర్ష నందన్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.