News August 17, 2024
HYD: ట్రాన్స్జెండర్ల కోసం జిల్లాకో ప్రత్యేక క్లినిక్

రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం 33 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు నిర్మించనుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ చేస్తోంది. ట్రాన్స్జెండర్లకు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సంక్షేమ శాఖ ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Similar News
News September 18, 2025
జూబ్లీ అభయం: ఒకరికి CM.. మరొకరికి పీసీసీ..!

జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపులో కొత్త రాజకీయం బయటకు వస్తుందని గాంధీభవన్‌లో చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ అనూహ్యంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం వెనక పీసీసీ వర్గం ఉన్నట్లు అంచనా. అంజన్‌కు టికెట్ ఇప్పించేందుకు పీసీసీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడి నుంచి నవీన్ కుమార్ లేదా దానం నాగేందర్‌కు మద్దతుగా ఉన్నట్లు టాక్.
News September 18, 2025
ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.
News September 17, 2025
పేట్ల బురుజులో పోలీసుల శిశు సంరక్షణ కేంద్రం

మహిళా పోలీసుల కోసం నూతన శిశు సంరక్షణ కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీసు అధికారుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 150-200 మంది పిల్లలకు ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు తమ పిల్లలను డ్యూటీ ప్రదేశానికి తీసుకువస్తే వారి సంరక్షణకు ఈ కేంద్రం ఎంతో భరోసా ఇస్తుందన్నారు.