News November 26, 2024

HYD: ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక నజర్

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా క్యారేజ్ వే ఆక్రమణలను తొలగించారు. హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ ఆధ్వర్యంలో తొలగింపు పనులు చేపట్టారు. అలాగే అనుమతులు లేకుండా సైరన్‌లు ఉపయోగిస్తున్న వారిపై చర్యలకు దిగారు. అనుమతి లేని సైరన్‌లను తీసివేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా సైరన్లు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయన్నారు.

Similar News

News December 7, 2024

సరూర్‌నగర్ BJP సభ (అప్‌డేట్స్)

image

సరూర్‌నగర్‌ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని BJP నేతలు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, BJP ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల పక్షాణ BJP నిరంతరం పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

News December 7, 2024

ఖైరతాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ.. కేంద్రమంత్రికి ఆహ్వానం

image

రాజ్‌భవన్ దిల్ కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకూ రావాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొన్నం తెలిపారు.

News December 7, 2024

HYD: డ్రగ్స్, సైబర్ కేసుల్లో కఠిన శిక్ష పడేలా చర్యలు: CM

image

హైదరాబాద్‌లో డ్రగ్స్, సైబర్ మహమ్మారి చేప కింద నీరులా విస్తరిస్తన్న నేపథ్యంలో డ్రగ్స్ నిరోధించడంలో కొంత ప్రగతి సాధించినప్పటికీ అది సరిపోదని, మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో కఠిన శిక్ష పడేలా స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నిపుణులైన అధికారులను నియమించాలన్నారు. ఈ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.