News June 14, 2024
HYD: ట్రైనీ ఐఏఎస్లకు సజ్జనార్ అవగాహన

తెలంగాణ కేడర్కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లు శుక్రవారం HYDలోని బస్భవన్ను సందర్శించారు. టీజీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలుపై వివరాలు తెలిపారు.
Similar News
News October 14, 2025
HYD: చనిపోయిన మహిళ వివరాలు గుర్తింపు

HYD మీర్పేట్ చందన (మంత్రాల) చెరువులో <<18001273>>మహిళ మృతదేహాన్ని<<>> బడంగ్పేట్ మమతానగర్ కాలనీకి చెందిన యాదమ్మ అలియాస్ కమల (50)గా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం ఆమె మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైడ్రా బృందం సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు మీర్పేట్ పోలీసులు తెలిపారు.
News October 14, 2025
HYD: కొత్త మద్యం పాలసీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కొత్త మద్యం పాలసీపై సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. దరఖాస్తు ఫీజు ఎక్కువ ఉంటే దరఖాస్తు చేయొద్దని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పారు. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేశారు.
News October 14, 2025
HYD: తెలుగు వర్శిటీ.. ఫిలిం డైరెక్షన్ దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్లోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీ నాంపల్లి ప్రాంగణంలో “పీజీ డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్” కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణతలైన వారు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వర్శిటీ రంగస్థల కళల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.రాజు 9346461733కు సంప్రదించాలన్నారు.