News January 9, 2025

HYD: ట్రై సైకిళ్లకు దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి

image

ఛార్జింగ్ ట్రై సైకిల్‌లకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగే తెలిపారు. సదరం సర్టీపికేట్ ఉండి, 80% శారీరక వైకల్యం, యూఐడి కార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఉన్న దివ్యాంగులు అర్హులుగా తెలిపారు. 2పాస్ ఫోటోలు వికాలాంగులుగా గుర్తించే పూర్తి డాక్యుమెంట్స్ ఈ నెల 18లోపు 33 జిల్లాల అధ్యక్షులు 10మంది పేర్లు తయారు చేసి పంపించాలని కోరారు.

Similar News

News January 10, 2025

HYD: ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’

image

వైకుంఠ ఏకాదశి వేడుకలను అన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’ మంత్రం పఠిస్తూ భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజధాని ప్రజలు పెద్ద ఎత్తున చీర్యాలకు క్యూ కట్టారు. దీంతో ECIL-నాగారం-రాంపల్లి చౌరస్తా- చీర్యాల రూట్‌లో వాహనాల రద్దీ నెలకొంది. SHARE IT

News January 10, 2025

HYD: రేపటి నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్

image

20 కోచుల సామర్థ్యం కలిగిన ఆరెంజ్ వందే భారత్ రైలు రేపు విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య సేవలు ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు వివిధ ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ పూర్తి చేసినట్లుగా తెలిపారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో భువనేశ్వర్, విశాఖపట్నం, పూనే మార్గాల్లోనూ వందే భారత్ రైల్వే సేవలు అందిస్తున్నారు.

News January 10, 2025

తిరుపతికి క్యూ కట్టిన ప్రజాప్రతినిధులు

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, డోర్నకల్ MLA రామ చంద్రనాయక్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మల్కాజ్గిరి నాయకులు రాము, ఇతర నేతలందరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు సైతం తిరుమల తిరుపతికి చేరుకున్నారు.