News August 16, 2024

HYD: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు టెండర్ల ఆహ్వానం

image

గ్రేటర్ HYDలో వివిధ కాలనీల్లో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సదుపాయాలు కల్పించకపోవడంతో వారు వాటిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో వాటిని సమకూర్చేందుకు GHMC సిద్ధమైంది. ప్రస్తుతం శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు టెండర్లు పూర్తి చేసి పరికరాలను సమకూర్చుకొని అమర్చనుంది.

Similar News

News September 21, 2024

నాంపల్లి: HWO జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల

image

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(HWO) జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసినట్లు TGPSC అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tspsc.cgg.gov.in నుంచి లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని, తమ ర్యాంక్ చూసుకోవచ్చని తెలిపారు. కాగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBRT) విధానంలో జూన్ 24 నుంచి జూన్ 29 వరకు పరీక్షలు నిర్వహించి, జులై 18న ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

News September 20, 2024

HYD: వ్యభిచారం చేస్తూ 2వ సారి దొరికారు!

image

వ్యభిచారం కేసులో పట్టుబడి జైలుకెళ్లొచ్చినా ఆ ఇద్దరి బుద్ధి మారలేదు. మళ్లీ దందా మొదలుపెట్టారు. CYB AHTU వివరాలు.. అల్లాపూర్ PS పరిధి గాయత్రినగర్‌‌లోని ఓ అపార్ట్‌మెంట్‌(102)లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందింది. సాయంత్రం రైడ్స్ చేసి ఆర్గనైజర్‌ వంశీకృష్ణ, పార్వతి, విటుడిని అరెస్ట్ చేశారు. వంశీకృష్ణపై గతంలోనే పిటా కేసు నమోదైంది. మహిళ కూడా వ్యభిచారం కేసులో జైలుకెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు.

News September 20, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

image

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్‌ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమంలో నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు దక్కినట్లు తెలిపారు.