News April 6, 2024
HYD: డిగ్రీతో పాటు మిలిటరీ ట్రైనింగ్.. మీ కోసమే..!

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని యువతులకు గురుకులాల అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. MA(ఎకనామిక్స్)+మిలిటరీ ట్రైనింగ్ అందించనున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా.. మిగతా వివరాలకు tswreis.ac.in వెబ్‌సైట్ చూడాలని HYD గురుకులాల అధికారులు Xలో ట్వీట్ చేశారు.
Similar News
News November 27, 2025
HYD: SSC JE ఎగ్జామ్ దరఖాస్తు చేశారా!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారికి HYD రీజియన్ అధికారి డా.ప్రసాద్ ముఖ్య సూచన చేశారు. ఎగ్జామ్స్ స్లాట్ సెలక్షన్ చేసుకుని అభ్యర్థులు లాగిన్ ఆప్షన్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఓపెన్ చేసి HYD ఎగ్జామ్ సిటీ లొకేషన్ ఎంచుకోవాలని సూచించారు. ఎంపిక కోసం DEC 28 వరకు గడువు ముగుస్తుందని తెలిపారు.
News November 27, 2025
ఇకనుంచి జలమండలిలో వాటర్ ఆడిట్: ఎండీ

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్‌లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
News November 27, 2025
సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం న్యాయవేదికను కదిలించింది. 54 ప్రాణాలు బలిగొన్న ఘోర విషాదం ఇంకా స్పష్టమైన నిజానిజాలు లేకుండానే సాగిపోతుందని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీ నివేదికలు, సాక్షాలు, చట్టపరమైన లోపాలన్నీ ముందుంచినా దర్యాప్తు పురోగతి శూన్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వచ్చేనెల 9కి వాయిదా వేసింది.


