News August 16, 2024

HYD: డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వివరాలకు ఓయూ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.

Similar News

News September 10, 2024

HYD: మరణంలోనూ వీడని స్నేహం

image

HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

News September 10, 2024

హైదరాబాద్‌లో మొదలైన సందడి

image

HYDలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. 3 రోజుల పాటు పూజలు అందుకున్న చిట్టి గణనాథులు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. సోమవారం సా. నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఈ నెల 11, 13, 15, 17న ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు వస్తారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌‌కి జై’ నినాదాలతో HYD హోరెత్తనుంది.

News September 10, 2024

HYDలో భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో‌ మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT