News September 24, 2024
HYD: డిగ్రీ సీట్లకు 25 నుంచి స్పాట్ ప్రవేశాలు
దోస్త్ పరిధిలోని ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు స్పాట్ విధానంలో సీట్లను ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొ.ఆర్. లింబాద్రి తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఓరిజినల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఫొటో, ఆధార్ కార్డ్, 2 జిరాక్సు సెట్స్ తీసుకురావాలని కోరారు.
Similar News
News October 12, 2024
హైదరాబాదీలకు దసరా స్పెషల్ ఏంటి?
దసరా వేడుకలు తెలంగాణ వారందరికీ స్పెషల్.. ఇక్కడి వారికి అమ్మమ్మ ఇల్లు యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో HYDలో ఉద్యోగాలు చేస్తూ తిరిగి సొంతూరుకు వెళ్లడం, బంధువులు, దోస్తులతో ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉరెళ్తామని ఎన్నో రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
HYD: నేడు జన్వాడకు సింగర్ మంగ్లీ, జానులైరి
శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వేడుకలకు సింగర్ మంగ్లీ, ఫోక్ డాన్సర్ జానులైరితో పాటు మరికొందరు కళాకారులు సందడి చేయనున్నట్లు బీజేపీ నాయకుడు గౌడిచర్ల వెంకటేశ్ యాదవ్ తెలిపారు. ఏటా బోనాలకు ఆహ్వానించే స్పెషల్ గెస్టులను ఈ సారి దసరాకు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన మేయర్
దసరా పండుగ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని, చెడుపై మంచి గెలుపు, అధర్మంపై ధర్మం విజయాన్ని సూచిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో స్నేహం, ఐక్యత, శాంతి, సత్ప్రవర్తనను ప్రోత్సహించాలని కోరారు. నగర ప్రజలకు సంక్షేమం, సుఖసంతోషాలు సర్వదా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.