News September 12, 2024

HYD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి: మంత్రి

image

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ HYDలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో ‌నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.

Similar News

News October 7, 2024

HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి

image

HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, మల్లారెడ్డి మనుమరాలు శ్రేయారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులున్నారు.

News October 6, 2024

HYD: రూ.100 కోట్ల అండర్ ట్యాంకుల నిర్మాణం

image

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో 50 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల వరద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అండర్ ట్యాంక్స్ నిర్మిస్తోంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 18 చోట్ల భూగర్భ ట్యాంకులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో వరద నీరు నిలిచే 141 ప్రాంతాలను 50కి తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

News October 6, 2024

HYD: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు

image

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె శనివారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆయన కుమార్తె అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. KPHB ఇందు విల్లాస్‌లో రాజేంద్రప్రసాద్‌‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చి గాయత్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆదివారం కేపీహెచ్‌బీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.