News June 4, 2024
HYD: డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, BRS
HYD ఎంపీ స్థానంలో కాంగ్రెస్, BRS డిపాజిట్లు కోల్పోయాయి.ఇక్కడ పోలైన మొత్తం ఓట్లలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 61.28% ఓట్లతో గెలుపొందారు. BJP అభ్యర్థి మాధవీలతకు 29.98% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్‌కు 5.83%, BRS అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు 1.73% ఓట్లు రాగా డిపాజిట్లు కోల్పోయారు. ఒవైసీకి 6,61,981, మాధవీలతకు 3,23,894, సమీర్‌కు 62,962, శ్రీనివాస్‌కు 18,641 ఓట్లు వచ్చాయి.
Similar News
News November 8, 2024
హైదరాబాద్‌లో డేంజర్ జోన్‌లు ఇవే!
గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) సాధారణ స్థాయికి మించి నమోదు అవుతున్నట్లుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. సనత్‌నగర్‌లో 168, కోకాపేట 114, న్యూమలక్‌పేట 102, జూపార్కు 111, HCU 108, బొల్లారంలో 118 AQI నమోదయినట్లుగా పేర్కొంది. AQI స్థాయి 100కు మించి ఉంటే శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT
News November 7, 2024
HYD: లక్షల్లో భవనాలు.. పదుల్లో ఫైర్ స్టేషన్లు..!
గ్రేటర్ HYDలో లక్షకు పైగా ఐదంతస్తుల కంటే ఎత్తు కలిగిన భవనాలు ఉన్నాయి. HYD, RR, MDCL జిల్లాల్లో చూస్తే అగ్నిమాపక కేంద్రాలు కేవలం 31 మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా సరైన సమయానికి అగ్నిప్రమాదం జరిగిన చోటుకు వెళ్లలేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాల స్థాయి పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News November 7, 2024
HYD: డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు: మంత్రి
డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. HYDలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఆమె చర్చించారు. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించడమే లక్ష్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తామని,పంచాయతీరాజ్, నిర్వహిస్తామని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల సంస్థలు ఇందులో భాగమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.