News October 22, 2024
HYD: డిప్యూటీ సీఎంను కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సచివాలయంలో డిప్యూటీ CM భట్టివిక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్కార్ అవార్డులో భాగం అయిన రాహుల్‌కు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు నిర్మాత బండ్ల గణేశ్ ఉన్నారు. డిప్యూటీ సీఎంను కలవటంతో వారిద్దరు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News October 30, 2025
ఆరుట్ల బుగ్గజాతరకు ఇలా వెళ్లండి

దక్షిణ కాశీగా పేరుగాంచిన <<18145591>>ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర స్వామి<<>> జాతర NOV 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ సన్నిధిలో తూర్పునుంచి పడమరకు నీరు ప్రవహించడం ప్రకృతి అద్భుతం. ఇక్కడికి ఎల్బీనగర్, పెద్దఅంబర్‌పేట్ నుంచి వెళ్లొచ్చు. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్లాలి. అక్కడి నుంచి ఆరుట్ల, బుగ్గతండాకు బస్సులు, ఆటోలుంటాయి. స్వయానా రామయ్యే ప్రతిష్ఠించడం, బుగ్గతండాలో ఉండటంతో బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలుస్తుంటారు.
News October 30, 2025
HYD: నేడు మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. HYD సిటీ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో OCT 30న గుడిమల్కాపూర్ రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఉద్యోగాలు పొందేందుకు 10వ తరగతి పాస్, ఫెయిల్ అయినవారి నుంచి డిగ్రీ హోల్డర్స్ వరకు అందరూ అర్హులే. ఐటీ, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్వేర్, ఫార్మసీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 87126 61501ను సంప్రదించండి.
SHARE IT
News October 30, 2025
రెండేళ్ల తర్వాత కేబినెట్లోకి హైదరాబాదీ!

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకు తెలంగాణ కేబినెట్లో హైదరాబాదీకి చోటు దక్కింది. బుధవారం అధిష్ఠానం నుంచి అనూహ్యంగా అజహరుద్దీన్ పేరు ఖరారు చేయడం విశేషం. జూబ్లీహిల్స్ టికెట్ త్యాగం చేసిన ఆయన పార్టీకి విధేయుడిగానే వ్యవహరించారు. దీంతో ‘అజ్జూ భాయ్.. ఏం చేద్దాం’ అని ఆయన చుట్టూ అనుచరులు ప్రదక్షిణలు చేశారు. జూబ్లీ బైపోల్ ముంగిటే మంత్రి పదవి వరించడంతో అజ్జూ భాయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


