News September 7, 2024

HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షుడు

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మార్యదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు వ్యవసాయ కమిషన్ నూతన ఛైర్మన్ కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు, కార్పొరేషన్ ఛైర్మన్లు అనిల్ కుమార్, శివసేన రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఉన్నారు.

Similar News

News November 22, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News November 22, 2025

HYD: నేడు కార్గో వస్తువుల వేలం

image

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో పెండింగ్‌లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.

News November 22, 2025

HYD: KPHB‌‌లో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

image

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్‌పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్‌తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.