News September 7, 2024
HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షుడు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మార్యదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు వ్యవసాయ కమిషన్ నూతన ఛైర్మన్ కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కార్పొరేషన్ ఛైర్మన్లు అనిల్ కుమార్, శివసేన రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఉన్నారు.
Similar News
News December 7, 2025
రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్

చిల్కూర్‌లో SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద యువతకి సీసీటీవీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి రంగారెడ్డికి చెందిన 18- 45 ఏళ్లలోపు పురుషులు చిల్కూర్ SBI శిక్షణ కేంద్రంలో పేరును నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. డిసెంబర్ 9 నుంచి ఉచిత శిక్షణతో పాటు, ఉచితంగా హాస్టల్ వసతి, భోజన సౌకర్యం, యూనిఫామ్, టూల్ కిట్ ఇస్తారు. వివరాల కోసం 8500165190లో సంప్రదించగలరు.
News December 6, 2025
రంగారెడ్డి: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో శుక్రవారంతో ముగిసింది. చివరి విడతలో స్వీకరించిన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు, 1598 వార్డులకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 526 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
News December 6, 2025
HYD: ఓఆర్ఆర్‌పై ప్రమాదాలు తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీ

ఓఆర్ఆర్‌పై అతివేగం, రాంగ్‌సైడ్ పార్కింగ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్ పోలీసులు, హెచ్ జీసీసీలు సంయుక్తంగా కార్యాచరణ దిగి 24 గంటల పాటు ఔటర్‌పై నిఘా ఉంచేందుకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.


