News November 7, 2024
HYD: డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు: మంత్రి
డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. HYDలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఆమె చర్చించారు. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించడమే లక్ష్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తామని,పంచాయతీరాజ్, నిర్వహిస్తామని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల సంస్థలు ఇందులో భాగమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
Similar News
News December 10, 2024
REWIND: ట్యాంక్‌బండ్‌లో విషాద గాథ తెలుసా?
సాగర్‌లో బుద్ధుడి విగ్రహ ప్రతిష్ఠలో పెను విషాదం జరిగింది. 1990 మార్చి 10న విగ్రహాన్ని HYDకు తీసుకొచ్చారు. పెద్ద పడవలో ఎక్కించి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అది కుదుపునకు గురైంది. విగ్రహం మెల్లిగా నీటిలోకి జారిపోవడంతో పడవలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విగ్రహాన్ని వెలికితీసే సాహసం చేయలేదు. 1992లో నాటి CM కోట్ల విజయ భాస్కర్ రెడ్డి చొరవ చూపి డిసెంబర్ 1992లో వెలికి తీసి ప్రతిష్ఠించారు.
News December 10, 2024
HYD: మంచుకురిసే వేళలో జాగ్రత్త!
HYD, VKB, RR జిల్లాలలో చలికి తోడు, ORR పరిసరాల్లో పొగ మంచు కమ్మేసింది. ORR, VKB జిల్లాలోని పలు గ్రామాల్లో ఉదయం 8 దాటినా పొగ మంచు తగ్గటం లేదు. వాహనదారులకు ఎదురొచ్చే ఇతర వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధిక పొగ మంచు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.VKB, ORR ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
News December 9, 2024
HYD: సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తాం: బిర్లా గ్రూప్
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.