News November 12, 2024
HYD: డీసీఏ అధికారులతో మంత్రి సమావేశం

నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించాలన్నారు.
Similar News
News October 19, 2025
CM రాక.. బోనంతో స్వాగతం

ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆదివారం వైభవంగా సాగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలో CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి ధర్నాచౌక్ ప్రాంగణానికి చేరుకున్న ఆయన కాన్వాయ్ డోర్ ఓపెన్ చేసి మహిళా కళాకారులకు అభివాదం చేశారు. నెత్తిన బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తున్న కళాకారుల్లో CMని చూసి ఉత్సాహం మరింత పెరిగింది.
News October 19, 2025
యాదవుల సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

యాదవ సోదరుల ప్రత్యేకత వారి నమ్మకం, విశ్వాసం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన వేదిక మీద మాట్లాడారు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరులదని కొనియాడారు. యాదవుల సహకారంతోనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు సదర్, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
News October 19, 2025
HYD: వేపను వెంటాడుతున్న వైరస్!

పచ్చటి ఆకులతో కళకళలాడాల్సిన వేపచెట్లను HYD శివారులో వైరస్ వెంటాడుతోంది. సర్వరోగ నివారిణిగా పిలిచే ఈ చెట్లను మాయదారి రోగం పట్టిపీడిస్తోంది. శీతాకాలం ఆరంభంలో చెట్ల ఆకులపై మంచు కురిసి కనులకు ఇంపుగా కనిపించాల్సింది పోయి, ఆకులు కాలినట్లుగా మారి ఎండిపోతున్నాయి. క్రమంగా మోడువారుతున్నాయి. ప్రతాప సింగారంలో 4 ఏళ్లలో ఈ వైరస్ సోకడం ఇది మూడోసారి అని స్థానికులు తెలిపారు.