News June 29, 2024

HYD: డీ.శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం: హరీశ్ రావు

image

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించడం చాలా బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈరోజు HYD బంజారాహిల్స్‌లోని ఎంపీ అరవింద్ నివాసంలోని డీఎస్ పార్థివదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

Similar News

News December 13, 2025

HYD: డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

image

38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ తెలిపింది. పుస్తక స్ఫూర్తి, బాలోత్సవం, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్‌ గౌడ్‌ పేర్లు నిర్ణయించారు.

News December 13, 2025

TRENDING: అబిడ్స్ సండే ‘మార్కెట్‌’

image

​ఆన్‌లైన్ పుస్తకాల హడావిడిలోనూ హైదరాబాద్ యువత ‘పాత పుస్తకాల’పైనే మోజు పెంచుకుంటోంది. డిజిటల్ విప్లవాన్ని ధిక్కరిస్తూ, ప్రతి ఆదివారం అబిడ్స్ ఫుట్‌పాత్‌లపై అరుదైన పుస్తకాలను వేటాడుతున్నారు. 60 ఏళ్ల నాటి క్లాసిక్‌లు, వింటేజ్ మ్యాగజైన్‌లు, సాహిత్యం కోసం వీరు ఇక్కడికి పోటెత్తుతున్నారు. కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యే ఈ అద్భుతమైన సంప్రదాయం నేటి యువతలో ట్రెండింగ్‌గా మారుతోంది. ఇక్కడ ధరలు కూడా తక్కువే.

News December 13, 2025

ఉప్పల్‌‌లో ఫుట్‌బాల్ మ్యాచ్.. CM, మెస్సీ ఆడేది అప్పుడే!

image

​సింగరేణి RR-9 వర్సెస్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఉప్పల్‌లో మ్యాచ్ షురూ అయ్యింది. 7v7 ఎగ్జిబిషన్/సెలిబ్రిటీ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ చివర్‌లో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్‌లోకి దిగి మెస్సీతో కలిసి ఆడనున్నారు. అంతకుముందు మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి చిన్నపిల్లలకు ఫుట్‌బాల్ క్లినిక్ నిర్వహించి, వాళ్లకు టెక్నిక్స్ నేర్పిస్తారు. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఇది పండగే.