News January 11, 2025

HYD: డేటింగ్ పేరుతో పిలిచి.. చివరికీ ఇలా..!

image

డేటింగ్ యాప్ పేరుతో యువకులు మోసపోతున్నారు. డేటింగ్ యాప్ ద్వారా యువకులను బుట్టలో వేసుకుంటున్న కొందరు, అర్ధరాత్రి యువకులకు ఫోన్ చేసి, నిర్మానుష్య ప్రాంతాలకు పిలిచి, డబ్బులు డిమాండ్ చేస్తూ అవసరమైతే బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు HYDలో 10కి పైగా జరిగాయి. ఇటీవలే అత్తాపూర్‌లోనూ ఇలాంటి ఘటనలు జరగగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. # SHARE IT

Similar News

News November 20, 2025

HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

image

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్‌పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్‌కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.

News November 20, 2025

షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

image

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News November 20, 2025

HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.