News November 25, 2024

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వారే అధికం.!

image

హైదరాబాద్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 21 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవారే 70 శాతానికి పైగా ఉండడం గమనార్హం. వీరిలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ సైతం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 51-150 మిల్లీగ్రాములు ఆల్కహాల్ ఉన్నట్లుగా తేలింది. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపోద్దని, ఒకవేళ నడిపితే కటకటాల్లోకి వెళ్తారని పోలీసులు హెచ్చరించారు.

Similar News

News December 9, 2024

RR: టీకా వాహనాలను ప్రారంభించిన కలెక్టర్

image

సంచార టీకా ద్విచక్ర వాహనాలను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వాహనాలు పల్లెలు, పట్టణాలు, జన సంచార ప్రాంతాలలోకి చేరుకొని పిల్లలు, గర్భిణీలకు నూరు శాతం టీకాలు ఇచ్చేందుకు దోహదపడతాయని చెప్పారు. డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి షీభహయత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాకేశ్, డీపీఓ అక్రమ్ పాల్గొన్నారు.

News December 9, 2024

REWIND: NIMS‌లో KCR దీక్ష విరమణ

image

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ‌భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.

News December 9, 2024

నేడు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

ప్రజాపాలన విజయోత్సవాలు నేటితో ముగియనున్నాయి. HYD వేదికగా భారీగా ఏర్పాట్లు చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తోంది. ఇదేరోజు దుండిగల్‌లో BRS కూడా విగ్రహావిష్కరణకు సిద్ధమైంది. దీనికి తోడు సోనియా గాంధీ జన్మదినం. మరోవైపు‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అభివృద్ధిపై కాంగ్రెస్, వైఫల్యాలు ఎత్తిచూపే ప్రతిపక్షాల ప్రసంగాలతో నేడు HYD దద్దరిల్లనుంది.