News April 4, 2024
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ హెల్‌మెట్.. నోజాబ్!

చిన్న చిన్న కేసులు ఉన్నాయని తమను పోలీసు ఉద్యోగాలకు దూరం చేయొద్దంటూ పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2022 కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. 1500 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, వితౌట్ హెల్‌మెట్, తదితర కేసులు ఉన్నాయని నియామకపత్రాలు ఇవ్వలేదని వాపోయారు. న్యాయం చేయాలని వేడుకొన్నారు.
Similar News
News February 21, 2026
RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News February 21, 2026
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ప్రతిమాసింగ్ ప్రసూతి సెలవులపై వెళ్లారు. ప్రసూతి సెలవులు ముగియడంతో ఆమె శనివారం తిరిగి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్‌ను కలిసి బొకే సమర్పించారు.
News February 21, 2026
RR: సోమవారం నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజవాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు.


