News July 8, 2024
HYD: డ్రగ్స్ తీసుకున్న 12 మందిపై కేసు

డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్థులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం, సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
Similar News
News February 28, 2026
HYD: ‘గాలి’ రిపేర్లు.. ‘అసలు’ బిల్లులు!

భూమి లోపల పైపులైన్ రిపేరు జరగదు కానీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మాత్రం నిధులు చేరిపోతున్నాయి. పాత లీకేజీల ఫొటోలనే కొత్తవిగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయకుండానే బిల్లులు డ్రా చేసే ‘ట్రిక్కు’ జలమండలిలో వైరల్ అయ్యింది. సెక్షన్ ఆఫీసర్ల అండదండలతోనే ఈ బోగస్ బిల్లుల దందా సాగుతోంది. థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పేరుకే తప్ప అంతా కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ అవినీతి మురికిని కడగాల్సి ఉంది.
News February 27, 2026
HYD: Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

HYD యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్. వ్యర్థాలను అర్థాలుగా మార్చుతున్న ఈ Gen Z తెలివితేటలు అమోఘం.
News February 27, 2026
KPHBలో గజం భూమి రూ. 2.65 లక్షలు

KPHBలో హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో KPHBలో చదరపు గజం భూమి గరిష్ఠంగా రూ.2.65 లక్షలకు విక్రయమైంది. 1400 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్ ధర రూ.1.10 కోట్లకు చేరింది. మొత్తం 12 ఆస్తుల వేలం ద్వారా రూ.24.26 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఓపెన్ ప్లాట్స్ ద్వారా రూ.15.81 కోట్లు, ఫ్లాట్స్ రూ.8.45 కోట్లు వచ్చాయి.


