News February 11, 2025
HYD: డ్రైవింగ్‌లో యువత బాధ్యతగా వ్యవహరించాలి

‘తల్లిదండ్రుల్లారా, మీ పిల్లలకు వాహనాలు కొనిచ్చి మురిసిపోవడం కాదు. రోడ్లపై వాళ్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా? లేదా? తెలుసుకోండి’ అని టీజీఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ తెలిపారు. యథేచ్ఛగా త్రిపుల్ రైడింగ్ చేస్తూ తప్పించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించాలన్నారు. డ్రైవింగ్ విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
PDPL: సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక దృష్టి: CP

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్, ప్రవర్తనా నియమావళి అమలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో సింగిల్ నామినేషన్లు లేవని VCలో పాల్గొన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక పర్యవేక్షణ పెడుతున్నట్లు CP అంబర్ కిషోర్ ఝా చెప్పారు.
News December 4, 2025
నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.
News December 4, 2025
ఉమ్మడి వరంగల్‌లో 130 ఏళ్ల పంచాయతీరాజ్ ప్రస్థానం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థ 130 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. HYD పంచాయతీ చట్టం నుంచి మొదలైన ఈ ప్రయాణంలో అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు, మండల వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీలు బలోపేతం అయ్యాయి. తండాలకు పంచాయతీ హోదా లభించడంతో జీపీల సంఖ్య 567 నుంచి 1708కి పెరిగింది. ఈ వ్యవస్థ ద్వారానే అనేకమంది నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు.


