News April 4, 2024
HYD: తండ్రిని హత్య చేసిన కొడుకు

డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకు.. తనను మందలించినందుకు కన్న తండ్రినే హత్య చేశాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో జరిగింది. ఆరెంజ్ అవెన్యూలో ఓ ఇంట్లో ఉంటున్న తిరుపతి రవీందర్(65)ను పెట్రోల్ పోసి అతడి కుమారుడు నిప్పంటించాడు. మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే రవీందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కొడుకు కోసం గాలిస్తున్నారు.
Similar News
News November 9, 2025
‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నగరంలో హైడ్రా చేసిన విధ్వంసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వీడియోలతో చూపించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఓ వ్యక్తి ‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’ అని రేవంత్ ఫొటోతో ఉన్న బ్యానర్ ప్రదర్శించారు.
News November 9, 2025
జూబ్లీ బైపోల్‌లో ఓటుకు రూ.2,500- రూ.5వేలు!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సా.5 గంటలకు ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో చివరి రోజు పార్టీలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు, ఓటుకు రూ.2500- రూ.5వేల వరకు పంపిణీ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల సంఘం కట్టడి చర్యలు చేపట్టింది. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నేటి సా.6 గం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయి.
News November 9, 2025
జూబ్లీహిల్స్‌లో: ఈరోజు నుంచి బస్తీ నాయకులదే హవా!

ప్రచారం కొద్ది గంటల్లో ముగియనుంది. నియోజకవర్గానికి నాయకులెవరూ వెళ్లరు. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు స్థానిక నాయకులు, బస్తీ లీడర్లు కీలకపాత్ర వహించనున్నారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా వీరిని కలిసి ఎవరికి ఏమేమి కావాలో తెలుసుకొని వారికి అవసరమైన డబ్బు, బహుమానాలు ఇచ్చే అవకాశముంది. అయితే నేరుగా వారికి ఇవ్వకపోయినా ఇతర నియోజకవర్గం బయట అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


