News August 26, 2024

HYD: తండ్రి ముందే కూతురు మృతి

image

తండ్రి ముందే కూతురు మృతి చెందిన విషాదఘటన హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరుకు చెందిన SPF SI శంకర్ రావు తన కుతూరిని బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వారి బైక్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 26, 2024

గాంధీ భవన్‌లో ఇంటలెక్చవల్ కమిటీ సమావేశం

image

నాంపల్లిలోని గాంధీ భవన్‌లో టీపీసీసీ ఇంటలెక్చవల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.

News November 26, 2024

సిటీలో ఎటు చూసినా యాపిల్ పండ్లే

image

కొద్దిరోజులుగా నగరంలో యాపిల్స్ ధరలు బాగా తగ్గిపోయాయి. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ నుంచి HYDకు ఇటీవల వీటి దిగుమతులు బాగా పెరిగాయి. మంచి క్వాలిటీ ఉన్న పండ్లు డజన్ రూ.180కే లభిస్తున్నాయి. బాటసింగారం, MJ మార్కెట్‌తో పాటు బోయిన్‌పల్లి మార్కెట్‌కు రోజూ అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఈ పరిస్థితి జనవరి నెలాఖరు వరకు ఉంటుందని బాటసింగారం మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు.

News November 26, 2024

రాజ్యాంగ దినోత్సవం: సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన సీఎస్

image

భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం డా.బీ. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సెక్రటేరియట్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతనం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట్‌రావు, పలువురు అదనపు కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.