News November 20, 2024
HYD: తగ్గిన ఫిర్యాదులు.. లెక్కలు ఇవే..!

గ్రేటర్ HYDలో డివిజన్లలో సెప్టెంబర్లో వినియోగదారుల ఇంటి వద్ద లీకేజీ సమస్యలు 12,105 జలమండలి దృష్టికి వచ్చాయి. అదే అక్టోబర్లో 9,697 నమోదై, గత నెలతో పోలిస్తే 2,408 ఫిర్యాదులు తగ్గాయి. అంటే 20% ఫిర్యాదులు తగ్గాయి. సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు సెప్టెంబర్లో 30,105 నమోదు కాగా, అక్టోబర్లో 23,293 నమోదై. గత నెలతో పోలిస్తే 6,812 ఫిర్యాదులు తగ్గాయి. అంటే 23% ఫిర్యాదులు తగ్గినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
Similar News
News September 16, 2025
నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్

నేడు హైదరాబాద్కు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
News September 15, 2025
కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్లేక్ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.
News September 15, 2025
జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.