News June 21, 2024

HYD: తనిఖీల కోసం మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం!

image

HYD నగరం సహా శివారు జిల్లాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ తనిఖీలను మరింత వేగవంతం చేసి, కఠిన చర్యలను తీసుకొని, అమలు చేసే విధంగా ప్రత్యేక మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News September 18, 2024

HYD: రాత్రంతా ఆగని శానిటేషన్!

image

ఎల్బీనగర్ పరిధిలోని సరూర్‌నగర్ చెరువు, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలోనూ శానిటేషన్ పనులు కొనసాగాయి. రాత్రుళ్లు విధులు నిర్వహించిన బృందాలను కమిషనర్ ఆమ్రపాలి కాటా ప్రత్యేకంగా అభినందించారు. ఆయా ప్రాంతాల్లో నిమజ్జనాలు సజావుగా సాగినట్లుగా డిప్యూటీ కమిషనర్ సుజాత పేర్కొన్నారు.

News September 18, 2024

HYD: ఇబ్బందులు లేవు జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చు: సీపీ

image

HYD సిటీ కమిషనర్ CV ఆనంద్ రంగంలోకి దిగారు. గణపతి నిమజ్జన చివరి ఘట్టం నేడు ఉదయం MJ మార్కెట్ రోడ్డుకు చేరుకుంది. ఎంజీ మార్కెట్ సహా, ట్యాంక్ బండ్ పరిసరాల పరిస్థితులను సీపీ పరిశీలించారు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని, తక్కువ సమయంలో నిమజ్జనం ముగుస్తుందని, జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చన్నారు. గతం కంటే ఈసారి ఉదయం 5 గంటలకు, పరిస్థితి చాలా మెరుగుగా ఉందని అభిప్రాయపడ్డారు.

News September 18, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓నారాయణగూడ: టస్కర్ పై నుంచి పడి మహిళ మృతి
✓ఖైరతాబాద్: జులూస్ డ్యాన్స్ అదుర్స్
✓ఘట్కేసర్: మైనర్ బాలిక పై కేశవరెడ్డి(36) లైంగిక దాడి
✓మోడీకి బాలాపూర్ లడ్డు అందిస్తాం: శంకర్ రెడ్డి
✓HYDలో ఘనంగా జరిగిన విమోచన, ప్రజాపాలన, సమైక్యత వేడుకలు
✓ఖైరతాబాద్ గణనాథునికి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
✓VKB: గల్లీ గల్లీలో గణనాథుని ఊరేగింపు