News July 2, 2024
HYD: తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జర జాగ్రత్త..!
పిల్లలను ఎక్కువ సేపు సెల్ ఫోన్ వాడనీయొద్దని, దానికి అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్ ఎక్కువుగా వాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి పిల్లలు వెళ్లిపోయిన ఘటనలు తాజాగా HYDలో వెలుగు చూశాయి. సికింద్రాబాద్ వారాసిగూడలో ఈశ్వర్(14), తార్నాక లాలాపేట్‌లో సాయివాసవి(13), నల్లకుంటలో మరో బాలిక(14) ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
Similar News
News October 12, 2024
హైదరాబాద్‌లో వైన్స్ షాపులకు పోటెత్తారు..!
దసరా నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని వైన్స్ షాపులకు మందుబాబులు పోటెత్తారు. ఏ వైన్స్ ముందు చూసినా రద్దీగా కనపడుతోంది. పండుగకు సొంతూరికి వచ్చిన వారితో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల షాపులు తెరవకముందే క్యూ కట్టిన దృష్యాలు కనిపించాయి.
NOTE: మద్యం తాగి వాహనాలు నడపకండి.
News October 12, 2024
హైదరాబాదీలకు దసరా స్పెషల్ ఏంటి?
దసరా వేడుకలు తెలంగాణ వారందరికీ స్పెషల్.. ఇక్కడి వారికి అమ్మమ్మ ఇల్లు యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో HYDలో ఉద్యోగాలు చేస్తూ తిరిగి సొంతూరుకు వెళ్లడం, బంధువులు, దోస్తులతో ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉరెళ్తామని ఎన్నో రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
HYD: నేడు జన్వాడకు సింగర్ మంగ్లీ, జానులైరి
శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వేడుకలకు సింగర్ మంగ్లీ, ఫోక్ డాన్సర్ జానులైరితో పాటు మరికొందరు కళాకారులు సందడి చేయనున్నట్లు బీజేపీ నాయకుడు గౌడిచర్ల వెంకటేశ్ యాదవ్ తెలిపారు. ఏటా బోనాలకు ఆహ్వానించే స్పెషల్ గెస్టులను ఈ సారి దసరాకు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.