News April 19, 2024
HYD: తల్లి, చెల్లిని పోషించలేక యువకుడి ఆత్మహత్య
తల్లి, చెల్లిని పోషించలేకపోతున్నానని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబాగూడకు చెందిన సంపత్ గౌడ్ (23) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా చేసిన పనికి 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేకపోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి ఓ పాఠశాల సమీపంలో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News September 20, 2024
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో నేషనల్ ఎనర్జీ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు దక్కినట్లు తెలిపారు.
News September 20, 2024
HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?
News September 20, 2024
28న రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘కళా మహోత్సవ్’ మొదటి ఎడిషన్ను ఈనెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న ఈ మహోత్సవాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సందర్శకులు https://visit.rashtrapatibhavan. gov.in వెబ్సైట్లో స్లాట్ను రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.