News January 31, 2025
HYD: తల్లి మృతి.. 9 రోజులు ఇంట్లోనే మృతదేహం

వారాసిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. తల్లి మృతి చెందడంతో డిప్రెషన్లోకి వెళ్లిన కూతుళ్లు 9 రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగుచూసింది. MLA పద్మారావు చొరవతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని గాంధీకి తరలించారు. మృతురాలు శ్రీ లలిత (45) గుర్తించారు. తల్లిని కోల్పోయిన రవళిక (25), అశ్విత (22) కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News December 1, 2025
నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
News December 1, 2025
అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తా: CM

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని, మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు(M) నల్లమాడు సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత పాలకుల ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు.


