News December 6, 2024
HYD: తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి ప్రత్యేకతలు ఇవే.!

HYD తార్నాకలోని రాష్ట్ర ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉద్యోగులందరికీ ఆరోగ్య సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో 15 డిస్పెన్సరీలు ఉన్నట్లు తెలిపింది. 24/7 ఫార్మా, ఫిజియోథెరపీ, ఐసీయూ, CT, MRI, ఆపరేషన్ థియేటర్, ల్యాబోరేటరీ, కాలేజీ, నర్సింగ్ ల్యాబ్, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు కాకుండా మిగతా వారికి సైతం నామమాత్రపు ఫీజుతో OP సేవలు అందిస్తారు.
Similar News
News November 28, 2025
కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.
News November 28, 2025
శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
News November 28, 2025
HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


