News December 26, 2024

HYD: తెలంగాణతల్లి విగ్రహానికి రూ.150కోట్లని పిటిషన్.. వివరాలెక్కడ: హైకోర్టు

image

HYDలోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పునకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని జూలూరు గౌరీ శంకర్ దాఖలు చేయగా, హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విగ్రహంపై క్యాబినెట్ నిర్ణయం, రూ.150 కోట్ల వ్యయానికి సంబంధించిన వివరాలు ఎక్కడా ప్రస్తావించ లేదని వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ తరఫు లాయర్ మయూర్ రెడ్డి పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

Similar News

News January 25, 2025

HYD: యువతి మర్డర్.. ఫొటోలు విడుదల (UPDATE)

image

HYD శివారు మేడ్చల్ మునీరాబాద్ గ్రామంలో యువతిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఓ వివాహితను(25) దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో మృతురాలి ఒంటిపై దొరికిన వస్తువుల ఫొటోలను విడుదల చేశారు. ఎవరైనా వాటిని గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

News January 25, 2025

HYDలో అర్ధరాత్రి రూల్స్ బ్రేక్!

image

నగరంలో‌ మిడ్‌నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, ఐటీ కారిడార్, కూకట్‌పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్‌ స్పీడ్‌తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికితోడు ఆకతాయిలు చేసే స్టంట్‌లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News January 24, 2025

HYD: కిడ్నీ రాకెట్ కేసులో కీలక అప్టేట్

image

కిడ్నీ మార్పిడి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలకానంద ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమంత్‌తో పాటు మరొకరు అరెస్ట్ అయ్యారు. అలకనంద హాస్పటల్‌లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారం 6నెలలుగా కిడ్నీ ట్రన్స్‌ ఫ్లాంటేషన్ ఆపరేషన్స్ కొనసాగుతున్నయి. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సుమంత్, బెంగళూరుకు చెందిన డాక్టర్ నేతృత్వంలో ముఠా ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.