News January 3, 2025

HYD: తెలంగాణ భవన్‌లో సావిత్రిబాయి ఫూలే జయంతి

image

HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నేడు సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా MLC మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యను బలోపేతం చేసేందుకు ఆమె చేసిన త్యాగాలను గుర్తుచేశారు. BRS నాయకులు పాల్గొన్నారు. 

Similar News

News January 21, 2025

ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య

image

ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. మంగళవారం తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు ఆయన వివరాలు తీసుకొని, ప్రక్రియను పూర్తి చేశారు. హీరో రాకతో కార్యాలయం సందడిగా మారింది. పలువురు అధికారులు ఆయనతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

News January 21, 2025

HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం  (UPDATE)

image

జామై ఉస్మానియాలో ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం 

image

సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.