News December 25, 2024
HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివ చరణ్ రెడ్డి
HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఢిల్లీలో ఉదయ్ భాను చిబ్, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ క్రిష్ణ అల్లవరును శివ చరణ్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నియామక పత్రం అందజేశారు.
Similar News
News December 27, 2024
నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 విశేషాలు
జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్లో 2,200 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్ల ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎంట్రీ ఫీజ్ రూ.50 (గతేడాది రూ.40)గా నిర్ణయించారు.
News December 27, 2024
HYD: మలేషియాలో తెలుగు కోర్సులు: నిత్యానందరావు
నాంపల్లిలో మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషలో డిప్లొమా కోర్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నామని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛైర్మన్ నిత్యానందరావు తెలిపారు. తెలుగు భాష ఉనికి పోతే తెలుగు జాతి ఆస్తిత్వం కోల్పోతుందన్నారు. ఇది మలేషియాలో స్థిరపడ్డ తెలుగు జాతికి ఎంతో ఉపయోగమన్నారు. మలేషియా తెలుగు సంఘం ప్రతినిధులు వెంకట ప్రతాప్, సత్తయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
News December 27, 2024
HYD: స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం
ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.