News December 25, 2024

HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివ చరణ్ రెడ్డి

image

HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఢిల్లీలో ఉదయ్ భాను చిబ్‌, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ క్రిష్ణ అల్లవరు‌ను శివ చరణ్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నియామక పత్రం అందజేశారు.

Similar News

News January 18, 2025

ఉప్పల్‌లో బస్సు కింద పడి మృతి (UPDATE)

image

ఉప్పల్ డిపోనకు చెందిన RTC బస్సు కిందపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటనసాయంత్రం జరిగింది. పూర్తి వివరాలు.. ఉప్పల్ బస్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు (TSU9Z 0280) నల్ల చెరువు మీదుగా వెళ్తోంది. కట్ట మీద ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా వెనుక టైర్ కింద పడ్డాడు. చక్రాలు అతని పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందారు. అతను ఎవరు? ఎందుకు బస్సు కింద పడి చనిపోయాడో వివరాలు తెలియాల్సి ఉంది.

News January 18, 2025

అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ విచారణ

image

అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు. దొంగలను వదిలిపెట్టిన ఆటో డ్రైవర్‌ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ విచారణలో తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News January 18, 2025

HYD: సినిమా ఛాన్స్ అంటూ యువతిపై లైంగిక దాడి

image

సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన బాధితురాలి ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.