News November 25, 2024

HYD: తెలుగులో భారత రాజ్యాంగం

image

HYDలోని రెడ్ హిల్స్ వద్ద ఉన్న సూరన ఆడిటోరియంలో భారత రాజ్యాంగ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి DSP చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని, భారత పౌరులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News December 9, 2024

హైదరాబాద్‌లో ‘Tiger Ka Hukum’

image

గతేడాది అధికారిక కార్యక్రమాలు, రాజకీయ ప్రసంగాలతో బిజీబిజీగా గడిపిన CM రేవంత్ రెడ్డి‌ ఆదివారం కాస్త‌ కూల్‌గా కనిపించారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా HYDలో నిర్వహించిన IAF AIR SHOWకు ముఖ్య అతిథిగా‌ హాజరయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్స్‌ విన్యాసాలను వీక్షించేందుకు సన్‌గ్లాసెస్‌ ధరించి మోడ్రన్‌ లుక్‌లో కనిపించారు. ‘Tiger Ka Hukum’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు CM రేవంత్‌ రెడ్డి ఫొటోను ‘X’లో పోస్ట్ చేశారు.

News December 8, 2024

హైదరాబాద్: PIC OF THE DAY

image

HYDలో ప్రజా పాలన విజయోత్సవాలు అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్ మీద IAF సూర్యకిరణ్‌ టీమ్ అద్భుతంగా ఎయిర్‌ షో నిర్వహించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, MLAలు తదితర అధికారులతో పాటు నగరవాసులు ఔరా అనేలా విన్యాసాలు జరిగాయి. సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్‌, అంబేడ్కర్ విగ్రహం వద్ద AIR Showకు సంబంధించిన పైఫొటో‌ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. PHOTO OF THE DAYగా నిలిచింది. ఫొటోపై మీ కామెంట్?
PIC CRD:@XpressHyderabad

News December 8, 2024

HYD: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షోకు వెళ్తున్నారా?

image

HYD హుస్సేన్ సాగర్ వద్ద జరిగే ఎయిర్ షోకి వెళ్లే వారికి పోలీసులు సూచనలు చేశారు. PVNR మార్గ్, నెక్లెస్ రోడ్డులో కార్లు, టూ వీలర్ పార్కింగ్, ఆదర్శనగర్ గల్లీలో టూవీలర్, GHMC హెడ్ ఆఫీస్ గల్లీలో కార్లు, టూవీలర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోట్ క్లబ్‌లో మంత్రుల కార్లు, అమరవీరుల స్మారక చిహ్నం వద్ద MLA, MP, MLC, IAS, నేతల వాహనాల పార్కింగ్ ఉంటుందని చెప్పారు.