News April 9, 2025
HYD: తెలుగు యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటి రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 17 వరకు ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, నిఘంటువులు, సంగీత, నృత్య గ్రంథాలు, భారత, భాగవతాలు, ప్రబంధాలు, పురాణాలు, పంచకావ్యాలు, ఇతిహాసాలు, చరిత్ర పంథాలు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను 60% రాయితీతో ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News December 6, 2025
కరీంనగర్: బాలికపై అత్యాచారం.. వ్యక్తికి 20ఏళ్ల జైలు

2022 ఫిబ్రవరి 3న నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై లైంగిక దాడి చేసిన నేరస్థుడు మడుపు నర్సింహా చారికి శిక్ష పడింది. POCSO చట్టంలోని సెక్షన్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
ప.గో: వెండితెరపై నవ్వులు పూయించిన నటుడు ఇక లేరు

వెండితెరపై తనదైన హాస్యంతో అలరించిన అలనాటి నటుడు, పాస్టర్ జోసెఫ్ గుండెపోటుతో మరణించారు. గురువారం చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మార్గమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనుకు చెందిన జోసెఫ్.. ‘పాతాళభైరవి’ సహా ఆరు చిత్రాల్లో నటించారు. కృష్ణ, కృష్ణంరాజు, కమలహాసన్ వంటి అగ్రనటులతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాస్టర్‌గా ఆయన ప్రసంగంలో నవ్వులు పూయించేవారు.


