News October 3, 2024
HYD: తోపుడు బండి, ఫుడ్ కోర్టు పెట్టారా..?మీకోసమే

✓తోపుడు బండ్ల నిర్వాహకులు చేతికి గ్లౌజులు, నెత్తిన టోపీ ధరించాలి
✓దుమ్ము అధికంగా ఉన్నచోట, మురుగు కాలువల పక్కన ఆహారం విక్రయించవద్దు
✓ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరి
✓ కవర్లలోకి గాలిని నోటితో ఊదవద్దు
✓ కూరగాయలు, ఉల్లిగడ్డలు ముందు రోజు కోసి నిల్వ ఉంచొద్దు
✓శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి
•HYD తార్నాక NIN ఈమేరకు సూచనలు చేసింది.
Similar News
News October 15, 2025
ఎన్నికల చిత్రం: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

ఎన్నికల వేళ పార్టీలు మారడం సహజమే. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. మస్కటి డైరీ డైరెక్టర్ అలీ మస్కటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు TDP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి BRSలో చేరారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత నాని ఆ పార్టీని వదిలి నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
News October 15, 2025
జూబ్లీ బైపోల్: క్రిటికల్ లొకేషన్.. పోలీసులకు టెన్షన్

జూబ్లీహిల్స్ బైఎలెక్షన్ పోలీసులకు కాస్త టెన్షన్‌గా మారింది. నియోజకవర్గంలో 139 లొకేషన్లలో 407 పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 139 ప్రాంతాల్లో 57 ప్రాంతాలను క్రిటికల్ లొకేషన్లుగా పోలీసులు గుర్తించారు. బోరబండ PS పరిధిలో 27, మధురానగర్ లిమిట్స్‌లో 18, జూబ్లీహిల్స్‌లో1, పంజాగుట్టలో 5, టోలిచౌకి 2, గోల్కొండ 2, సనత్‌నర్లో 2 ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు.
News October 15, 2025
జూబ్లీ బైపోల్: పట్టున్నా.. పోరులో లేదాయే..!

జూబ్లీహిల్స్ బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లుండగా వీరిలో 96వేల మంది మైనారిటీ ఓటర్లున్నారు. ఈ ఓట్లన్నీ ఎటువైపు పడితే ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడనడంలో డౌట్ లేదు. అందుకే ఈ ఓట్ల కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. MIMకు పట్టు ఉన్నా పోటీచేయకపోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంతర్గతంగా కాంగ్రెస్‌కి ఆ పార్టీ మద్దతిస్తున్నట్లు సమాచారం.