News February 9, 2025
HYD: త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తా: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. బీసీ సంబంధిత అంశాలపై కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాధన తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 28, 2025
రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం చుక్కాపూర్లో 39.6℃, మాడ్గుల్, మంగళ్‌పల్లె 39.5, మీర్‌ఖాన్‌పేట 39.4, కందవాడ 39.3, కడ్తాల్, కాసులాబాద్ 39.2, ఇబ్రహీంపట్నం, ఎలిమినేడు 39.1, రాజేంద్రనగర్, చందనవెల్లి 39, ముద్విన్, తాళ్లపల్లి, దండుమైలారం 38.9, మొగలిగిద్ద 38.8, యాచారం, షాబాద్ 38.7, కేశంపేట 38.6, వెల్జాల 38.5, తట్టిఅన్నారం 38.4℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 28, 2025
HYD: కూతురిని హత్య చేసిన తల్లి

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News March 28, 2025
హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

రంజాన్ చివరి శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా రానుండటంతో పోలీసులు HYDలో ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉ.8 నుంచి సా.4వరకు మూసేస్తున్నారు. చార్మినార్‌కు వచ్చే నయాపూల్ నుంచి మదీనా, శాలిబండ- హిమ్మత్‌పుర, చౌక్‌మైదాన్-మొగల్‌పుర, మీర్ఆలం మండీ/బీబీ బజార్, మూసాబౌలి- మోతీహాల్, గన్సీబజార్- హైకోర్టు రోడ్డుకు వాహనాలు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.