News July 13, 2024
HYD: త్వరలో నీలోఫర్లో గర్భిణులకు SPECIAL

HYDలోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టేందుకు HALతో రూ.20.22 కోట్ల ఒప్పందం జరిగింది. రూ.10.20 కోట్లతో భవన నిర్మాణం, వైద్య పరికరాలకు రూ.10.02 కోట్లు ఖర్చు చేయనున్నారు. భవనం పూర్తయితే గైనిక్ ఓపి ప్రారంభమవుతుందని యాంటినెంటల్, 2D, ECHO, అల్ట్రా సౌండ్, మల్టీ పారామీటర్స్ వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని డా.ఉషారాణి తెలిపారు.
Similar News
News November 17, 2025
HYD: మహిళలు.. దీనిని అశ్రద్ధ చేయకండి

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని HYD MNJ వైద్యులు తెలిపారు. రొమ్ములో కణతి చేతికి తగలడం, చనుమొన నుంచి రక్తం, ఇతర స్రవాలు కారటం, చొట్టబడి లోపలికి పోవడం, ఆకృతిలో మార్పు, గజ్జల్లో వాపు లాంటివి కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు దాటిన మహిళ మామోగ్రామ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం మంచిదని MNJ ప్రొ.రఘునాథ్రావు తెలిపారు.
News November 17, 2025
HYD: ఈ ఏరియాల్లో మొబైల్స్ మాయం!

నగరంలోని రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్ల వద్ద రెప్ప పాటు క్షణాలలో దొంగలు సెల్ఫోన్లు ఎత్తుకుపోతున్నారు. సిటీ పరిధిలో నిత్యం 30-40 మొబైల్ చోరీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బహిరంగ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.SHARE IT
News November 16, 2025
రాష్ట్రపతి CP రాధాకృష్ణన్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఉప రాష్ట్రపతిని సత్కరించారు. గవర్నర్ రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందులో సీఎంతో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.


