News January 18, 2025
HYD: త్వరలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు: KTR

త్వరలో చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. చేవెళ్లతో పాటుగా పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని, ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకు BRS పార్టీ నిర్విరామంగా పోరాడుతుందని KTR అన్నారు. కాగా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య BRS నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
Similar News
News October 13, 2025
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేకు జర్నలిజం మీద మక్కువ

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి వృద్ధాప్య సమస్యలతో HYDలోని అపోలో ఆస్పత్రిలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితాంతంల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2 సార్లు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన జర్నలిజంపై మక్కువతో న్యూస్ సర్వీస్ సిండికేట్ సంస్థను స్థాపించారు. మరికాసేపట్లో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర జరగనుంది.
News October 13, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు గెజిట్ విడుదల

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. షేక్పేట తహశీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇవాళ్లి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. వచ్చే నెల 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News October 13, 2025
HYD: జాగ్రత్త! HSRP పేరుతో మోసాలు!

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్లకు నకిలీ ఆర్టీఏ చలాన్ కాల్స్ వస్తున్నాయి. మీకు రూ.3,400 జరిమానా పడిందని మోసగాళ్లు చెబుతున్నారు. దీనిపై ఆందోళన చెందిన ఓ డ్రైవర్ స్థానిక అధికారులను సంప్రదించగా, అది నకిలీ కాల్ అని తేలింది. HSRP సంబంధించి ఎలాంటి తుది గడువును ఇప్పటివరకు ప్రభుత్వం విధించలేదని అధికారులు స్పష్టం చేశారు.