News January 9, 2025
HYD: త్వరలో HMDA ప్లాట్లు మరోసారి వేలం!
HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1,500 నుంచి 2,000 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో పలు దఫల్లో వేలం వేసినా మిగిలిపోయాయి. అయితే తాజాగా..మరోసారి వేరే వేయాలని నిర్ణయించారు. 8-14 అంతస్తుల అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. దీంతో రాజీవ్ స్వగృహ ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
Similar News
News January 17, 2025
BRAOUలో ట్యూషన్ ఫీజుకు చివరితేదీ జనవరి 25
డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సార్వతిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, 2nd, 3rd ఇయర్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ జనవరి 25 అని విద్యార్థి సేవల విభాగాల అధిపతి డా.వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ పొంది సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినవారు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. సందేహాలుంటే 040-236080222 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
News January 17, 2025
ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం
కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్‌కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.
News January 17, 2025
HYD: జంట హత్యల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
నార్సింగి PSలో <<15169186>>జంట హత్య<<>>కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. సాకేత్‌కు బిందుతో పరిచయం ఏర్పడింది. అనంతరం సాకేత్ సాయంతో బిందు వ్యభిచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అంకిత్ స్నేహితుడు రాహుల్ బిందుతో ఏకాంతంగా గడిపి వీడియో తీసేందుకు యత్నించాడు. ఆమె అడ్డు చెప్పి అక్కడి నుంచి వచ్చి సాకేత్‌కు చెప్పడంతో రాహుల్‌ను హెచ్చరించాడు. దీంతో రాహుల్ కక్ష పెంచుకుని మరో ఇద్దరితో కలిసి హతమార్చాడు.