News June 7, 2024
HYD: ‘దండం పెట్టి చెబుతున్నాం.. రోడ్లపై చెత్త వేయకండి’
గ్రేటర్ HYD ప్రజలకు శుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా పిలుపునిచ్చారు. HYD మాదాపూర్‌లోని గఫూర్‌నగర్‌లో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త (GVP పాయింట్)ను శుభ్రం చేసి, ముగ్గులు వేసి మాట్లాడారు. ‘ప్రజలందరికీ దండం పెట్టి చెబుతున్నాం.. ప్లీజ్ రోడ్లపై చెత్త వేయకండి.. ఇది మన హైదరాబాద్.. మనం అందరం శుభ్రంగా ఉంచుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం’ అని పిలుపునిచ్చారు. కాగా దుర్వాసన వస్తున్నా వారు క్లీన్ చేశారు.
Similar News
News December 10, 2024
అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం
వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాలలో పామాయిల్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
News December 10, 2024
HYD ఈ నెల రాష్ట్రానికి ప్రముఖులు: మంత్రి పొన్నం
ఈనెల 14వ తేదిన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ వద్ద దొడ్డి కొమరయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నేపథ్యంలో ఏర్పాట్లపై డా.బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొనున్నట్లు తెలిపారు.
News December 10, 2024
JNTU డైరెక్టర్ కథనానికి స్పందించిన అధికారులు
నిబంధనలను అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్న JNTU డైరెక్టర్ శీర్షికన Way2 Newsలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే డైరెక్టర్ ఉపయోగిస్తున్న కారుకు సంబంధించి బ్లాక్ ఫిలింను తొలగించడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న ఫైన్స్ సైతం కట్టేశారు. అధికారిక అవసరాలకు ఉపయోగించాల్సిన వాహనాలను వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని వాటి పైన కూడా అధికారులు దృష్టి సారించాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.