News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.

Similar News

News November 20, 2025

HYD: గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా

image

నగరంలోని వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ వందన తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించి సర్టిఫికెట్లతోపాటు ఆధార్ కార్డు, రెజ్యూమ్‌తో మల్లేపల్లిలోని (విజయనగర్ కాలనీ) ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో హాజరుకావచ్చని వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు 83284 28933 నంబరుకు కాల్ చేసి పొందవచ్చని పేర్కొన్నారు.

News November 20, 2025

గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

image

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.

News November 20, 2025

ఎమ్మెల్యేల ఫిరాయింపు.. MLA గాంధీ న్యాయవాదుల విచారణ

image

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారనే పార్టీ ఫిరాయింపు విచారణకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీ కార్యాలయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఆరుగురి విచారణ ముగిసింది.