News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.

Similar News

News October 16, 2024

రూ. 2000 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం

image

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గోషామహల్‌‌లో దాదాపు 32 ఎకరాల్లో రూ. 2000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించే పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే పేషెంట్ల సమస్యలు తీరుతాయని శుభవార్త చెప్పారు.

News October 16, 2024

HYD: LRS తర్వాత మూడు రెట్ల భారం!

image

HMDA పరిధిలో LRS కింద ఇప్పుడు క్రమబద్ధీకరించుకుంటే 2020 నాటి భూమి విలువ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ఆలస్యం చేస్తే మూడు రెట్ల భారం పడనుంది. నిర్మాణ అనుమతి తీసుకునే నాటి భూమి విలువతో 33 శాతం జరిమానా, 14 శాతం ఓపెన్ ప్లాట్ డెవలప్‌మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే LRS రుసుములు చెల్లించాలని సూచిస్తున్నారు.

SHARE IT

News October 15, 2024

BREAKING: HYD: గోనెసంచిలో బాలిక మృతదేహం

image

HYD మేడ్చల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసరగడి గ్రామంలో గోనెసంచిలో బాలిక మృతదేహం లభించింది. ఈనెల 12న కుమార్తె జోష్న(7) కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయడంతో ఈరోజు బాలిక మృతదేహం గోనెసంచిలో కనిపించింది. దీంతో కేసు నమోదు చేసి, బాలికను ఎవరు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.