News March 4, 2025
HYD: ‘దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్’

మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. BRS దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, పింక్ బుక్ ఓపెన్ చేస్తే కవిత చేసిన స్కామ్లే పాములై బయటకొచ్చి కాటేసే ప్రమాదం ఉందన్నారు.
Similar News
News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
News November 19, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్కు పంపిస్తామన్నారు.
News November 19, 2025
యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

యువత పెళ్లి కంటే కెరీర్పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.


