News March 4, 2025

HYD: ‘దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్’

image

మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, రాష్ట్రంలో దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. BRS దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, పింక్ బుక్ ఓపెన్ చేస్తే కవిత చేసిన స్కామ్‌లే పాములై బయటకొచ్చి కాటేసే ప్రమాదం ఉందన్నారు.

Similar News

News March 25, 2025

మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2025

BRS సభ వేదిక ఘట్కేసర్‌కి మార్పు!

image

BRS రజతోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ వేదికను మార్పు చేస్తున్నట్లు సమాచారం. వేసవి తీవ్రత సందర్భంగా పార్కింగ్ సదుపాయాలు అన్ని జిల్లాల నుంచి రవాణా సదుపాయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, తాజా సభ కోసం HYD శివారు ఘట్కేసర్ వద్ద ప్రముఖ ప్రైవేట్ స్కూల్ వెనక ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు సమాచారం, ఉంది. ఉంది…!

News March 25, 2025

MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

image

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

error: Content is protected !!