News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట

GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.
Similar News
News October 17, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఈరోజు 21 నామినేషన్లు

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈరోజు 17 మంది 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేయగా 12 మంది వివిధ రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాఖలయ్యాయి. ఐదు రోజుల్లో ఇప్పటి వరకు మొత్తం 63 నామినేషన్లు వచ్చాయి.
News October 17, 2025
బంజారాహిల్స్: బంద్ ఫర్ జస్టిస్‌కు కవిత మద్దతు

‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కోరుతూ ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి లేఖ రాశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీకి అర్హత లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను బీజేపీ కావాలనే పెండింగ్‌లో పెడుతోందన్నారు.
News October 17, 2025
BREAKING: ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో హాష్ ఆయిల్‌తో పట్టుబడ్డ బాలుడు

ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో హాష్ ఆయిల్ తీసుకెళుతున్న బాలుడిని మల్కాజిగిరి SOT, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా ఈరోజు పట్టుకున్నారు. దేబేంద్ర జోడియా శ్రీను అనే వ్యక్తి ఒడిశా నుంచి HYDకు రూ.1.15 కోట్ల విలువైన 5.1 కిలోల హాష్ ఆయిల్‌ను బాలుడితో పంపిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించామని, పరారీలో ఉన్న దేబేంద్ర కోసం గాలిస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.